Ram Charan: రామ్ చరణ్ ధరించిన ఈ షర్టు ధర ఎంతో తెలుసా..?

Ram Charan..మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట చిరుత సినిమాతో తన కెరీయర్ ను మొదలుపెట్టి RRR సినిమా వరకు తన రేంజ్ ను ఒక్కో సినిమాతో పెంచుకుంటూనే పోతున్నారు. ఇటీవల గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు. రాజమౌళితో మగధీర చేసి.. రెండవ సినిమాతోనే మంచి హిట్ కొట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం లెజెండ్రీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలోని విడుదల చేసే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో RC -16 చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా పెద్ది అని ఖరారు చేసినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ కు ఒక అరుదైన గౌరవం కూడా లభించింది.. అదే రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. చెన్నైకు చెందినటువంటి వేల్స్ యూనివర్సిటీలో ఈ డాక్టరేట్ అందుకున్నారు రామ్ చరణ్..

Ram Charan: Do you know the price of this shirt worn by Ram Charan?
Ram Charan: Do you know the price of this shirt worn by Ram Charan?

రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ ధర ఎంతంటే..

గత కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కుటుంబ సమేతంగా అక్కడకు హాజరయ్యారు.. ఈ నేపథ్యంలోనే తన భార్య , కూతురు ఇద్దరినీ కూడా వెంటపెట్టుకొని వెళ్లారు రామ్ చరణ్. ముఖ్యంగా చెన్నైలో దిగిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో కొన్ని ఫోటోలు బయటకు రాగా అవి చాలా వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించినటువంటి షర్టు గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఒక చర్చ జరుపుతున్నారు.. రామ్ చరణ్ వేసుకున్న షర్టుని ఢీకొట్ చేసీ చూడగా దీని ధర తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ ధరించిన ఈ వైట్ షర్టు ధర అక్షరాల రూ.63,000 అన్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..

కూతురు వల్లే సక్సెస్..

ముఖ్యంగా రామ్ చరణ్ కూతురు క్లింకార పుట్టిన తర్వాత రామ్ చరణ్ కు బాగా అదృష్టం కలిసి వచ్చిందని పలువురు అభిమానులు కూడా తెలుపుతున్నారు. రామ్ చరణ్ కు కూతురు పుట్టిన తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు పొందడమే కాదు.. ఆస్కార్ రెడ్ కార్పేట్ పై నడిచి.. ఈ గౌరవం అందుకున్న సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. అలాగే సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను గౌరవ డాక్టరేట్ ని కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా మారారు రామ్ చరణ్.

- Advertisement -

రామ్ చరణ్ ఫ్యామిలీ..

రామ్ చరణ్ కాస్త సమయం దొరికితే చాలు భార్య , కూతురితో సమయం గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.. ఈ నేపథ్యంలోని ఈ మధ్యకాలంలో ఎక్కువగా తన భార్య కూతురుతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు రాంచరణ్.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు