Eagle : మాస్ మహారాజ్ ‘పద్ధతైన దాడి’..

Raviteja

టాలీవుడ్ లో సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సోలో రిలీజ్ కి రెడీ అయిన “ఈగల్” ఎట్టకేలకు ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈగల్ తో తాము ఒక డిఫరెంట్ మాస్ ఆక్షన్ సబ్జెక్ట్ తో వస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే చెప్పడం జరిగింది.

అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ గాని ఏది పెద్దగా హైప్ పెంచలేకపోయాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా రిలీజ్ ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. పద్ధతైన దాడి అంటూ రిలీజ్ చేసిన ఆ వీడియో నిమిషంన్నర నిడివి ఉన్నా కూడా పెద్దగా మేకర్స్ ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఏవో రెండు మూడు డైలాగులతో డీసెంట్ గా ఉండగా, మాస్ మహా రాజ్ పద్ధతైన దాడి అంటూ ట్రైలర్ చెప్పారు. అయితే ఈ సినిమాకు పోటీ పెద్దగా లేకపోవడం ప్లస్ పాయింటే అయినా కూడా మౌత్ టాక్ పై డిపెండ్ అయ్యే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కి రెండు రోజులు కూడా లేదు కానీ, బుక్ మై షో లో ఇప్పటివరకు సరైన బుకింగ్స్ జరగనే లేదు. ఇక ఈగల్ కు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇవ్వగా, అన్ని అవాంతరాలు దాటుకుని 9న రాబోతున్న ఈగల్ బాక్స్ ఆఫీస్ పైన ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు