Pushpa 3 : తగ్గేదేలే అంటున్న సుకుమార్… మూడవ పార్ట్ కి ప్లాన్ షురూ

Pushpa 3

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ “పుష్ప”. ఈ సినిమాలో ఆయన మేనరిజంకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అందరి కళ్ళు పుష్ప సీక్వెల్ గా రూపొందుతున్న “పుష్ప : ది రూల్” పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక్కడితో పుష్ప రాజ్ స్టోరీ ఆగిపోదని, మేకర్స్ మరో సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకీ ఆ కథ ఏంటి? “పుష్ప 3” టైటిల్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప” ఊహించని విధంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. అలాగే అల్లు అర్జున్ క్రేజ్ ని ప్రపంచ వ్యాప్తంగా తారాస్థాయికి తీసుకెళ్లి నిలబెట్టింది. ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వరూ సంపాదించలేని నేషనల్ అవార్డును అల్లు అర్జున్ కు తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అదరగొట్టిన “పుష్ప : ది రైజ్”కు సీక్వెల్ గా “పుష్ప : ది రూల్” రాబోతుందని అప్పట్లోనే ప్రకటించారు. ప్రస్తుతం భారీగా అంచనాలున్న “పుష్ప 2” ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. సినిమా పర్ఫెక్ట్ గా రావాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఒక్కో షెడ్యూల్ ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 55 శాతం పూర్తయిందని, జూన్ కల్లా షూటింగ్ మొత్తం ముగించి, ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది పుష్ప టీం. దీంతో “పుష్ప 2” వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే “పుష్ప”రాజ్ కథ ఇక్కడితో ఆగిపోదని ఇంకో సీక్వెల్ కూడా రాబోతోందని అంటున్నారు.

నిన్న మొన్నటిదాకా రెండవ భాగంతో పుష్ప రాజ్ స్టోరీకి ఎండ్ కార్డు పడుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మూడవ భాగానికి సంబంధించిన ప్లాన్స్ షురూ అయ్యాయట. మొదటి భాగం “పుష్ప ది రూల్” తర్వాత రూపొందిపోయే మూడో భాగానికి “పుష్ప ది రోర్ అనే టైటిల్ లో అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మొదటి భాగంలో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించాడు సుక్కూ. రెండవ భాగం తన సామ్రాజ్యాన్ని పుష్ప రాజ్ ఎలా విస్తరించాడు అని, మూడవ భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేయబోయే యుద్ధంతో ముగియబోతోందని అంటున్నారు.

- Advertisement -

నిజానికి ముందుగా “పుష్ప”ను ఒక వెబ్ సిరీస్ గా తీయాలని అనుకున్నారట సుకుమార్. ఆ తర్వాత అల్లు అర్జున్ కి తగ్గట్టుగా దానికి మార్పులు చేర్పులు చేసి థియేటర్లోకి తీసుకొచ్చారు. అనూహ్యంగా”పుష్ప”కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ పై దృష్టి పెట్టారు సుకుమార్. ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ జపాన్లో జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “పుష్ప 3” గురించి చిత్ర బృందం నుంచి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు