Goodachari -2 : టాలీవుడ్ హీరోని ఢీ కొట్టనున్న బాలీవుడ్ విలన్.. ఇదో కొత్త ట్రెండ్..!

Goodachari -2

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలలో నటించడానికి బాలీవుడ్ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఆఫర్లు ఇచ్చినా కూడా వద్దన్న హిందీ తారలు ఇప్పుడు ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యానిమల్ హిట్ తర్వాత బాబి డియోల్ కి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. రెండు మూడు సినిమాలకు సంతకం కూడా చేశారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ముద్దుల వీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ హస్మి కూడా టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటి తరం ఆడియన్స్ కి ఈయన పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ 15 ఏళ్ల క్రితం అతను తన నటనతో బాలీవుడ్ ని షేక్ చేశారు . అడల్ట్ కంటెంట్తో సినిమాలు చేసి అప్పటి యువతను బీభత్సంగా ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత దూకుడు తగ్గించారనే చెప్పాలి.ప్రస్తుతం తెలుగులో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హస్మి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు మరొక సినిమాలో ఈయన అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం .టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు అడివి శేష్ హీరోగా సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం గూఢచారి 2. ఇందులో విలన్ గా ఇమ్రాన్ హస్మి. ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి విలన్ గా చేయబోతున్నాడు అని తెలిసి అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. అంతేకాదు ఈ సినిమా అసలు సిసలైన స్పై థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందని కూడా అంటున్నారు.. మరి ఇమ్రాన్ హస్మి- అడివి శేష్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాయో చూడాలి.

- Advertisement -

అంతేకాదు టాలీవుడ్ హీరోలు వర్సెస్ బాలీవుడ్ విలన్లు ఈ కొత్త ట్రెండేదో బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..ఇకపోతే ఒకప్పుడు బాలీవుడ్లో ఇమ్రాన్ హస్మి , బాబీ డియోల్ వంటి వారు హీరోలుగా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు చిన్నచూపు చూసిన టాలీవుడ్ ఇప్పుడు సంచలన విజయాలు సాధిస్తుండడంతో బాలీవుడ్ స్టార్స్ కూడా మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా టాలీవుడ్ సినీ పరిశ్రమ ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు