Raviteja : డబుల్ ఇంపాక్ట్ తో మాస్ క్రాకర్

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇటీవ‌ల వ‌చ్చిన‌ క్రాక్‌ సినిమాతో హిట్ సాధించారు. కానీ ఆ త‌రువాత వ‌చ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా మాత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. హిట్‌, ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌ను చేస్తున్నారు ర‌వితేజ‌. అందుకే ఇప్పుడు ద‌మాకాతో రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఈ చిత్రానికి త్రినాథ్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ‘ధ‌మాకా’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ‌లీల‌కి ఈ సినిమా రెండ‌వ‌ది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, పాట‌లు, టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా దీపావ‌ళి పండ‌గ‌కు ఈ చిత్రం నుంచి క్రాక‌ర్ బ్లాస్ట్‌గా ‘ధ‌మాకా’ టీజ‌ర్‌ ని విడుద‌ల చేశారు.

ర‌వితేజ ‘ధ‌మాకా’ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ బాగానే ఉన్న‌ట్టు టీజర్ ని బ‌ట్టి తెలుస్తోంది. టీజర్ ర‌వితేజ ఎఫ్ఐసీ అని చెప్పే ఓ డైలాగ్‌తో ప్రారంభ‌మ‌వుతుంది.  ‘నేను మీలో విల‌న్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు. కానీ నేను యాక్ష‌న్‌లో ఉన్న‌ప్పుడు శాడిస్ట్‌ని’ అని ర‌వితేజ చెప్పిన డైలాగ్‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలో యాక్ష‌న్ తో పాటు కామెడీ, ల‌వ్ కూడా బాగానే ఉన్న‌ట్టు టీజర్ ద్వారా క‌నిపిస్తోంది. ముఖ్యంగా అటు నుంచి ఒక్క బుల్లెట్ వ‌స్తే.. ఇటు నుంచి ఇక దీపావ‌ళే అనే డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. చివ‌ర‌కు ట్రైల‌ర్‌లో దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెబుతూ ముగించేశారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు ద‌మాకాను తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్‌. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు