మెగాస్టార్ చిరంజీవి దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ తో మంచి జోష్‌లో ఉన్నారు. ఇక తన తరువాత సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేసి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. టాలెంటేడ్ డైరెక్టర్ బాబీ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటేడ్ మూవీగా మెగా 154 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటుంది. ఇటీవలే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ పవర్ పుల్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేవిధంగా మెగా154 రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌ని దీపావళికి విడుదల చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు టైటిల్ టీజర్ విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.
Read More: SkandaPreReleaseThunder: స్కంద ట్రైలర్ ఎప్పుడంటే ?
అనౌన్స్ మెంట్ పోస్టర్ ను చూస్తే.. సినిమాలో చిరు లుక్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉందని అర్థమవుతుంది. విడుదల చేసిన పోస్టర్ పై బాస్ వస్తున్నాడు అని రాయడంతో అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యేర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటో గ్రాఫర్, ఎడిటర్‌గా నిరంజన్ దేవరనూనె, డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా.. కొన వెంకట్, కె.చక్రవర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అక్టోబర్ 24న టైటిల్ ఏం ఉంటుందోనని మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: Aishwarya Lekshmi : హీరోయిన్ నుంచి నిర్మాత..
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...