Rashmika mandanna: అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర గిఫ్టుగా ఇచ్చిందా..? ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన ఈమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం హిందీలో యానిమల్ అనే పాన్ ఇండియా చిత్రం, మరోవైపు పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అయితే రష్మిక తాజాగా తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె పెళ్లి వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించింది. అయితే ఈ పెళ్లి వేడుకలలో రష్మిక ఆరెంజ్ కలర్ సారీ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించింది. ఈ చీర చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీరలో రష్మిక చాలా అందంగా కనిపించింది.

ఈ చీర ప్రముఖ డిజైనర్ అనిత డుంగ్రి డిజైన్ చేశారట. ఈ శారీ ఖరీదు ఏకంగా 35 వేల రూపాయలు అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి సెలబ్రిటీలు ఇలా ఖరీదైన దుస్తులు ధరించడం సర్వసాధారణమే. అయితే ఈ చీర గురించి రష్మిక మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ చీరను ఆమెకి ఓ స్పెషల్ అండ్ లవ్లీ పర్సన్ కానుకగా ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లి తనకు ఈ చీరను గిఫ్టుగా ఇచ్చిందని.. ఈ చీర అంటే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. దీంతో ఈ చీరలో మెరిసిన రష్మిక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు