Samantha Ruth Prabhu: రాజకీయాల్లోకి సమంత..?

Samantha Ruth Prabhu

సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇటీవల ఎక్కువగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాలలోకి వస్తుందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఏంటి..? రాజకీయాల్లోకి రావడం ఏంటి..? అసలు ఎక్కడినుండి ఇది జరుగుతుంది..? ఎందుకు ఇప్పుడు సమంత రాజకీయాలలోకి వస్తుందనే అనుమానాలు వస్తున్నాయి కదా..? అసలు విషయంలోకి వెళితే.. హీరోయిన్ సమంత బిఆర్ఎస్ పార్టీలోకి రాబోతుందని.. ఆమెను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించి స్టార్ క్యాంపెనర్ గా ప్రచారం నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో సమంతకు ఎక్కువ అవినాభావ సంబంధాలు ఉండడం, మరోవైపు ఇప్పటికే రైతన్నలకు ఆమె మద్దతుగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి తెలిసిన విషయాలే. అలాగే సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎలక్షన్లలో ఆమెను ప్రచారం కోసం బీఆర్ఎస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. సమంతను పార్టీలోకి తీసుకు రావడం ద్వారా కచ్చితంగా పార్టీకి కలిసి వస్తుందని వారు భావిస్తున్నారట.

అంతేకాదు దీనికోసం బీఆర్ఎస్ అధిష్టానం కూడా సమంతతో చర్చలు జరపగా.. ఈ విషయంపై త్వరలోనే ఆమె నిర్ణయం చెబుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె అభిమానులు మాత్రం సమంతకి రాజకీయాలలోకి రావడం అస్సలు ఇష్టం లేదని అంటున్నారు. ఇప్పటికే సమంత అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతుందని.. ఇలాంటి పుకార్లు తీసుకురావద్దని కొందరు, దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా ఆమెనే స్పందించాలని మరికొంతమంది అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు