Bigg Boss season 7: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా.. ? వైల్డ్ కార్డు ఎంట్రీ డీటేల్స్ ?

Bigg Boss season 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోమొదటి వారంలో ఊహించని ట్విస్ట్ రాబోతుందని తెలుస్తోంది. ముందు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ షో.. గడిచిన బిగ్ బాస్ సీజన్ లలో జరిగిన కొన్ని లోపల వల్ల.. .. ప్రేక్షకుల్లో విపరీతమైనా నెగిటివిటీ ను మూట గట్టుకుంది. అయితే ఈ సీజన్ విషయంలో మాత్రం గతంలో జరిగిన తప్పులేవి జరగకుండా అలాగే ఎలాంటి నెగిటివిటీ లకు తావు లేకుండా ఉండటానికి బిగ్ బాస్ యాజమాన్యం తగు జాగ్రతలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

ఇప్పటి వరకు జరిగిన 3 ఎపిసోడ్స్ లను బట్టి చూస్తే.. బిగ్ బాస్ యజమాన్యం త్వరలోనే ఎవరు ఉహించనటువంటి ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఇప్పటి వరకు హౌస్ లోకు వెళ్లిన ప్రతి కంటిస్టెంట్ తో హౌస్ లోకి వెళ్ళేముందు మీరు హౌస్ లోకి వెళ్లినంత మాత్రాన హౌస్ మేట్స్ కాదు.. కేవలం కంటిస్టెంట్స్ మాత్రమే అని పదే పదే చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ఇప్పటివరకు హౌస్ లోకి వెళ్లిన వాళ్ళెవ్వరు ఇంకా ఫైనల్ అవ్వలేదనేది అర్థమవుతుంది.

కాగా ఇన్సైడ్ సమాచారం ప్రకారం.. వోటింగ్ తో సంబంధం లేకుండా కూడా బిగ్ బాస్ టీం కొంత మందిని డైరెక్ట్ గా ఎలిమేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతున్న వారిపైన ప్రయోగించే అవకాశం ఉంటుందట. అలాగే బిగ్ బాస్ లోకి మరికొంత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రెండో వారంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు