Bigg Boss season 7: టేస్టీ తేజా.. కాదు ఎంటర్టైనర్ తేజా.. ఏకంగా బిగ్ బాస్ పైనే పంచులు వర్షం

Bigg Boss season 7

ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంటర్టైనమెంట్ డోస్ మాములుగా లేదు. నాగార్జున ముందు నుంచి చెబుతూ వస్తునట్టుగానే ఉల్టా..పల్టా అనే కాసెప్ట్ ఈ సీజన్ కు బాగానే వర్క్ అవుట్ అయ్యేలాగానే తెలుస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ లోకి వెళ్లిన కంటిస్టెంట్స్ అంత మొదటి రోజు నుంచే ఆట ఆడటం మొదలు పెట్టారు. షో స్టార్ట్ అయిన కేవలం 48 గంటలలోనే అప్పుడే గ్యాంగ్ లు కూడా స్టార్ట్ చేసారు. మొదటి నామినేషన్ ప్రాసెస్ కూడా నిన్నటితో ఇప్పటికే ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు జరిగిన 2 ఎపిసోడ్స్ లో చూసుకున్నట్టు అయితే యూట్యూబర్ టేస్టీ తేజా అందరిని ఆకట్టుకుంటున్నాడు.

ఇటీవల కాలంలో బాగా పాపులరైన యూట్యూబ్ లో ఫుడ్ వీడియోస్ తో అందరిని ఆకట్టుకున్న తేజా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. రావడం.. రావడమే నాగార్జున తో తనదైన స్టైల్ లో పంచులు వేసి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసాడు. ఇక షో లో కూడా అందరితో ఈజీ గా కలిసి పోతు.. ఒక పక్క హౌస్ మేట్స్ ను, మరోపక్క షో చూస్తున్న ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కూడా టేస్టీ తేజా తన తెలివి తేటలు చూపించాడు. బిగ్ బాస్ నిన్న టేస్టీ తేజాను పిలిచి ఎవరైనా ఇద్దరినీ నామినేట్ చేయమని చెప్పగా.. తన దగ్గర ఒక వ్యక్తిని నామినేట్ చేయడానికే మాత్రమే రీజన్ ఉందని చెప్పాడు. కానీ బిగ్ బాస్ మాత్రం ఖచ్చితంగా ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ ను మరియు కిరణ్ రాథోర్ ను నామినేట్ చేసాడు. అలాగే బిగ్ బాస్ కు వాళ్ళిద్దరి నామినేట్ చేయడానికి గల కారణాన్ని కూడా చక్కగా వివరించాడు. ఇక చివరిలో టేస్టీ తేజాను బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ జరిగిన రూమ్ లోనే తేజాను పడుకోమని సరదాగా చెప్పగా.. ఏంటి ఇక్కడ పడుకోవాల అంటూ.. బిగ్ బాస్ పై పంచ్ వేసి హౌస్ లోకి వెళ్ళిపోయాడు. మొత్తంగా ఈసారి సీజన్ లో టేస్టీ తేజా ఒక్కడే ట్రూ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్నాడు. మరీ ముందు ముందున్న టేస్టీ తేజా ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు