Bigg Boss Leaks: డేంజర్ జోన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మొదటి వారమే అవుట్ ?

Bigg Boss Leaks

బుల్లితెరపై బిగ్ బాస్ సందడి స్టార్ట్ అయింది. అప్పుడే ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా జరిగిపోయాయి. మొదటి వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఫస్ట్ వీక్‌కే హౌస్‌లో ఇన్ని గొడవలు జరిగితే, ఫైనల్ వీక్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కంటెస్టెంట్సే డైరెక్టర్‌గా “ఇప్పుడే స్టార్ట్ అయింది.. ఇప్పుడప్పడే ఇది తగ్గదు” అంటూ డైరెక్ట్ స్టెట్‌మెంట్స్ ఇస్తున్నారంటే, పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే తొలి వారంలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, రతిక, దామిని భట్ల, షకీలా, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఈ వారం ఓటింగ్ లో ఉండనున్నారు. అయితే వీరిలో దాదాపు అందరికీ ఎంతో కొంత సెలబ్రెటీ స్టేటస్ ఉంది.

ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేని వ్యక్తులు అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది పల్లవి ప్రశాంత్. తర్వాత ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ అనే చెప్పొచ్చు. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ కూడా కొంత స్టేటస్, అలాగే బ్యాగ్రౌండ్ ఉంది. కానీ, ఇక్కడ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్.

- Advertisement -

బ్యాగ్రౌండ్ లేకపోయినా పల్లవి ప్రశాంత్ యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది కొంత వరకు ఉపయోగపడొచ్చు. అయితే ఈ ఫాలోయింగ్‌కు సమానంగా వ్యతిరేకత కూడా ఉంది. రైతు బిడ్డ అనే సింపతితో బిగ్ బాస్‌కి వెళ్లాడు అంటూ కొంత మంది పల్లవి ప్రశాంత్‌ను ట్రోల్ చేస్తున్నారు.

బ్యాగ్రౌండ్ లేేకపోవడం, సోషల్ మీడియాలో నెగిటివిటీతో పాటు, హౌస్‌లో పల్లవి ప్రశాంత్ తీరుపై ఇప్పటికే విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. రతికకు బాగా ఇన్‌ఫ్లూయన్స్ అవుతున్నాడని, అలాగే హౌస్‌లో ఉన్నప్పుడు అతనిలో జెన్యూనిటి కనిపంచడం లేదని, యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. వీటిన్నిటీ మధ్య పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యాడు. ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది.

వీటిని అన్నింటిని తట్టుకుని, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతాడా? లేదా, మొదటి వారమే తట్ట, బుట్ట సర్దుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడా? అనేది తెలియాలంటే, ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్‌లు ప్రిన్స్ యావర్ కి ఉన్నాయని తెలుస్తోంది. ఇతనిపై కూడా ట్రోల్స్ బాగానే వస్తున్నాయి. ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ పేరుతో బట్టలన్నీ విప్పుకుని తిరుగుతున్నాడని, కండలు చూపించడమే పనిగా పెట్టుకున్నాడనే నెగిటివిటి ఉంది. అలా, ఆడియన్స్ ప్రిన్స్ యావర్ ని టార్గెట్ చేస్తే పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు