Kamalhasan: ఇండియన్ టైటిల్ కూడా చేంజ్ చేసేస్తారా?

Kamal hasan:

ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ లోక నాయకుడు కమల్ హాసన్ కాంబోలో  ఇండియన్2 సినిమా తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందే మొదలైన ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా పాతికేళ్ల కిందట వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమా తెలుగులో భారతీయుడు పేరుతో రిలీజ్ అయింది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది. 2024 సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును అఫిషియల్ గా మారుస్తూ భారత్ అని తీర్మానించడం జరిగింది. అయితే అందరు భారత్ అని పిలుస్తున్నా బుక్కుల్లో అధికారిక లెక్కల్లో మాత్రం ఇండియా అనే పేరే వాడుకలో ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారు పెట్టిన పేరును మారుస్తూ ఇండియా ని భారత్ అనే పేరుతో పిలవాలని తీర్పునిచ్చారు.

అయితే ఇప్పుడు వస్తున్న ఇండియన్2 సినిమాకు ఇదే సమస్య గా మారింది. ఇండియన్ పేరు ను తీసేసి భారత్ అని పేరు పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇండియన్ సినిమాకు తెలుగులో భారతీయుడు అనే పెడతారు కాబట్టి పెద్దగా ప్రాబ్లెమ్ లేదు. మరి టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ మళ్ళీ ఆలోచిస్తే సినిమాలో ఏమైనా మార్పులు చేయాలేమో అని నెటిజన్లు సందేహిస్తున్నారు. ఏది ఏమైనా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు