G20 Meeting: G20 టూరిజం సదస్సు లో పాల్గొంటున్న గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నాడు. RRR చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులారిటీని దక్కించుకున్న రామ్ చరణ్, ఆ చిత్రానికి పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు ఇండియా లెవెల్లో రామ్ చరణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యనే ఆసియాలో ప్రముఖ సంస్థ అయిన “ఆసియన్ “హాల్ ఆఫ్ ఫేమ్” వారు ఇంటర్నేషనల్ నామినీస్ గా “విజనరీ లీడర్స్” జాబితాలో రామ్ చరణ్ ఎంపిక ఆయిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా రామ్ చరణ్ నిలవడం విశేషం.

ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి నేషనల్ వైడ్ గా వార్తల్లో నిలిచాడు. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో “జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్” నిర్వహిస్తున్న టూరిజం సమావేశానికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల తరపున రామ్ చరణ్ హాజరవుతున్నాడు. ఈ సదస్సు లో పాల్గొంటున్న మొదటి సౌత్ నటుడు రామ్ చరణ్ కావడం విశేషం.

ఈ టూరిజం మీటింగ్ జమ్మూకాశ్మీర్ లోని శ్రీ నగర్ లో జరుగుతుంది. ఇక 2019 లో ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత శ్రీ నగర్ లో జరుగుతున్న తొలి భారీ సమావేశం ఇది. అందువల్ల జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో పాల్గొనే అతిథుల భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)ని, మార్కోస్ కమాండోస్‌ పహారాను ఏర్పాటు చేశారు. అలాగే జమ్ము, కశ్మీర్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌ కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. జి20 టూరిజం నిర్వహిస్తున్న ఈ సదస్సు 22, 23, 24 తేదీలలో మూడు రోజుల పాటు జరుగనుంది.

- Advertisement -

ఇక ఈ సదస్సు లో రామ్ చరణ్ టూరిజం పైన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి పైన చర్చించనున్నారు. మే 22 న శ్రీ నగర్ కు బయలుదేరిన రామ్ చరణ్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం లో
మీడియా కెమెరాలకు చిక్కారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు