Chai biscuit :మేమ్ ఫేమస్ కి షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ !

యూట్యూబ్ చూసే అలవాటు ఉన్న వాళ్లందరికీ ఛాయ్ బిస్కెట్ వీడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజు సరికొత్త కంటెంట్ క్రియేట్ చేసి, జనాలని ఎంటర్టైన్ చేసే ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ హౌస్ గా మారి, వరుస సినిమాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది.

ఛాయ్ బిస్కెట్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సుహాస్ హీరోగా ఇటీవలనే రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తీసిన వీళ్ళు మొదటి ప్రయత్నంతోనే మంచి విజయం సాధించారు. తక్కువ బడ్జెట్ తో ఎలాంటి హడావిడి లేకుండా, ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉండే కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే ఛాయ్ బిస్కెట్ ప్రస్తుతం మేం ఫేమస్అనే సినిమాతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో యూట్యూబ్ లో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలనే విడుదల చేసారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతున్న ఈ సినిమాలో అందరు యూట్యూబ్ యాక్టర్లే నటించారు. ప్రముఖ సెలెబ్రెటీలందరితోను సినిమా ప్రమోషన్స్ గట్టిగ చేస్తున్నారు మూవీ యూనిట్. ట్రైలర్ కూడా నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, బుచ్చి బాబు సనా చేతుల మీద లాంచ్ చేసారు. ఇలా అందరు సెలెబ్రెటీలని సినిమా ప్రమోషన్స్ లో భాగం చేస్తూ సినిమాని జనాల దగ్గరికి చేరుస్తున్నారు. ఇటీవలనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ లభించింది. గీత ఆర్ట్స్ ఈ సినిమాని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు