2018: అక్కడిలాగే తెలుగులోనూ దున్నేస్తుందా?

కేరళలో 2018 లో ఆగస్ట్ నెలలో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వరదల్లో చిక్కుకొని 164 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎన్నో వందల,జంతువులు చనిపోయాయి. ఈ వరదల నేపథ్యంలో మలయాళంలో తెరకెక్కిన సినిమా “2018”. ఈ సినిమాను “జూడో ఆంథోనీ జోసెఫ్” దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ టువినో థామస్, కుంచకో బోబన్ హీరోలుగా నటించగా, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, లాల్ కీలక పాత్రల్లో నటించారు. కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేణు కునపిళ్లే, ck పద్మ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

తాజాగా తెలుగులోనూ ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. 2018 ట్రైలర్ ని గమనిస్తే చాలా సింపుల్ కథాంశంతో మంచి ఎమోషన్స్ తో కట్టిపడేలా తీసారని అర్ధమైపోతుంది. ఇక ఈ సినిమాలో పాత్రలపై కాకుండా కథలోని భాగంగానే ఈ సినిమా నడుస్తుందని చెప్పొచ్చు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సినిమా బడ్జెట్ 15కోట్లు మాత్రమే. కానీ అంత తక్కువ బడ్జెట్ తో ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ తో రియలిస్టిక్ గా తీయడమంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.

మే5 న మలయాళంలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన 2018 మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే 120 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా పయనిస్తోంది. ఇప్పుడు 2018 సినిమా తెలుగులోనూ విడుదల అవుతుంది. ప్రముఖ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమా హక్కులు కొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక 2018 చిత్రం మే 26న తెలుగులో విడుదల అవుతుండగా, మలయాళం లో ఇండస్ట్రీ హిట్ అవుతున్న ఈ సినిమా తెలుగు లో కూడా భారీ హిట్ అవ్వొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎప్పుడో నెల కిందట రిలీజ్ అయిన విరూపాక్ష మినహా తెలుగులో మరో హిట్ బొమ్మ రాలేదు. మరి ఇలాంటి టైమ్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు