Tollywood: విలక్షణ నటుడు శరత్ బాబు కన్నుమూత

విలక్షణ నటుడు శరత్ బాబు ఈరోజు (మే22) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యం కారణంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 20న హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేరి చిక్తిత్స తీసుకున్నారు శరత్ బాబు. అయితే ఆయన మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో 1951 జులై 31 న జన్మించారు శరత్ బాబు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితీతులు. 1973 లో రామరాజ్యం చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన కన్నె వయసు, మరో చరిత్ర, ఇది కథ కాదు, తాయారమ్మ బంగారయ్య, మూడు మూళ్ళ బంధం, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, సాగర సంగమం, ఆపద్భాంధవుడు, మగధీర తదితర చిత్రాల్లో మంచి పాత్రలు వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేసిన ఆయన దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.

రీసెంట్ గా సీనియర్ యాక్టర్ నరేష్ హీరోగా వస్తున్న “మళ్లీ పెళ్లి శరత్ బాబు నటించిన చివరి చిత్రం. ఇక ప్రముఖ కమెడియన్ రమాప్రభ ను వివాహం చేసుకున్న శరత్ బాబు అభిప్రాయ భేదాల కారణంగా 1988 లోనే విడిపోయారు. ఆ తర్వాత తమిళనాడు కి చెందిన స్నేహ నంబియార్ ను పెళ్లి చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా మూడు నందులు పొందిన ఆయన టాలీవుడ్ లో విలక్షణ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

- Advertisement -

మే21 నే టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా ఒక్కరోజు వ్యవధిలోనే నటుడు శరత్ బాబు మృతిచెందడం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించేందుకు ఆయన సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు