Ram charan: ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామచరణ్ ఈ పేర్లు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టిన చిరంజీవి ఆ వెంటనే ఇటివల గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ లో ఖుషిలో ఉన్నారు. ఆ అనందం ఇంకా పోలేదు.. అప్పుడే మెగా కంపౌండ్ లోకి మరో అరుదైన అవార్డు వచ్చి చేరింది.

కేవలం వారం రోజుల గ్యాప్ లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎన్డీటీవీ “ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా” అవార్డు సాధించాడు. దీని తర్వాత మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తెలుగు సినిమా స్థాయిని మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఇప్పటికే పెంచాడని, ప్రస్తుతం చిరు తనయుడు రామ్ చరణ్ తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా రామ్ చరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ రావడంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

‘నాన్న.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు సాధించడం నాకు ఎంతో సంతోషంగానూ.. గర్వంగా కూడా ఉంది. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ అమ్మా, నాన్న’ అంటూ తన ట్వీట్ చేశాడు. అలాగే రామ్ చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు స్వీకరిస్తున్న ఫోటోలను కూడా జత చేశాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు