Indian2: రకుల్ ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ హాట్ బ్యూటీ అంట..

కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత రకుల్ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో యంగ్ హీరోలకి ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్ పొజిషన్ నుంచి, స్టార్ హీరోల సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసే స్టేజ్ దాకా వెళ్ళింది. దాదాపు తెలుగులో అందరి స్టార్ హీరోలతో వర్క్ చేసిన రకుల్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలేవి లేకుండా పోయాయి. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ టాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. కానీ రకుల్ కి మాత్రం టాలీవుడ్ సినిమాలే చేయాలని ఉందని అప్పుడప్పుడు ఆమె పెట్టె సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా తెలుస్తోంది.

ఇక విషయానికొస్తే ఇటీవలనే కండక్ట్ చేసిన హిందూస్తాన్ టైమ్స్ అవార్డ్స్ లో రకుల్ ని స్టైలిష్ హాట్ స్టెప్పర్ అవార్డ్ వరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ స్టైలిష్ అవుట్ ఫీట్స్ తో ఫొటోలకి ఫోజ్ లు ఇచ్చే రకుల్ కి స్టైలిష్ హాట్ స్టెప్పర్ అవార్డ్ రావడంతో ఆమె తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

- Advertisement -

ప్రస్తుతం రకుల్ శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న అయలాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఆమె శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్2లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు రెండు, మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది ఈ బ్యూటీ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు