Tej: విరూపాక్ష ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా..?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి 100కోట్ల మార్క్ దిశగా అడుగులేస్తోంది. తెలుగు సినిమా రీచ్ పాన్ ఇండియా వ్యాప్తిగా పెరగటంతో ఇక్కడ హిట్ అయిన చిన్న సినిమాలు కూడా హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కార్తికేయ2, సీతారామం సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో కార్తికేయ2 ని ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యి విరూపాక్ష సినిమాని కూడా హిందీలో, తమిళ్ లో రిలీజ్ చేసారు ఈ సినిమా నిర్మాతలు.

తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విరూపాక్ష తమిళ్, హిందీ భాషల్లో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని అంటున్నారు. హిందీలో కూడా హిట్ అందుకొని తేజ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందని ఆశించిన మెగా ఫ్యాన్స్ ఆశలు ఫలించలేదు. హిందీలో పెద్ద సినిమాలేవీ లేకపోయినా విరూపాక్ష అక్కడ హిట్ అందుకోలేకపోవటానికి కారణం సరైన ప్రమోషన్స్ లేకపోవటమే అని అంటున్నారు.

కార్తికేయ2 హిందీలో హిట్ అవ్వటానికి ప్రధాన కారణం ఆ సినిమా కథ కృష్ణుడి చుట్టూ తిరగటమే అని చెప్పాలి. పైగా నార్త్ ఆడియెన్స్ లో ఆధ్యాత్మిక కథలకు బాగా ఆదరణ ఉండటం మరో కారణం అని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమా విషయంలో అలాంటి ఎలిమెంట్స్ లేకపోవటం మైనస్ అయ్యిందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ అందుకున్న తేజ్ కి విరూపాక్ష హిందీలో కూడా రిలీజ్ అవ్వటం వల్ల పాన్ ఇండియా ఎక్స్పోజర్ అయితే వచ్చిందని చెప్పాలి. ఈ ఎక్స్పోజర్ ద్వారా తదుపరి సినిమాలతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు