Ghosty :గ్లామర్ రోల్స్ కోసం చూస్తున్న కాజల్

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్, మగధీర సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచి కాజల్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది. ఇక ఈ సినిమాతో కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు, వరుస తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

దాదాపు 50 సినిమాల్లో నటించిన కాజల్ జోరు పెళ్లి అయ్యాక పూర్తిగా తగ్గిపోయింది. కాజల్ 2020లో గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ఆ ఇయర్ సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కాజల్ కి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దాంతో కాజల్ కూడా తన భర్త బిజినెస్ చూసుకుంటూ ఉండిపోయింది. అయితే రీసెంట్ గానే కాజల్ ఘోష్టి అనే తమిళ్ హర్రర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. చాలా రోజుల గ్యాప్ తరువాత కాజల్ నటించిన సినిమా అవడంతో ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ సినిమా ఒక మోస్తరు పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే ఘోష్టి సినిమా తరువాత అయిన కాజల్ బిజీ అవుతుందనుకుంటే ఆ పరిస్థితీ లేకుండా పోయింది. కాజల్ కి ఘోష్టి సినిమా తర్వాత నుంచి అందరు విమెన్ ఓరియెంటెడ్ కథలనే వినిపిస్తున్నరంట కానీ కాజల్ కి మాత్రం గ్లామర్ రోల్స్ చేయాలని ఉందంట. అందుకే తన దగ్గరికి వచ్చిన విమెన్ ఓరియెంటెడ్ కథలకి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందంట. అయితే పెళ్ళికి ముందు అంటే గ్లామర్ రోల్స్ చేసింది కానీ ఇప్పుడు పెళ్లై, ఒక బాబు కూడా ఉన్న తరువాత గ్లామర్ రోల్స్ చేయాలనుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం కాజల్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఇండియన్2 లో నటిస్తుంది. ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు కాజల్ ఈ మధ్యనే ఒక హిందీ సినిమాకి కూడా ఒకే చెప్పిందంట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు