Rajinikanth: మరోసారి తలైవా సరసన

గత కొన్నేల్లుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను అందుకోవడం లేదు. రోబో తర్వాత ఆ స్థాయి సక్సెస్ రజనీకాంత్ కు దక్కలేదు. ” అన్నత్తై” తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్న చిత్రం ” జైలర్”. బీస్ట్ మూవీ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గడ్డంతో స్టైల్ గా వెనక్కి చేతులు కట్టుకొని నడుస్తున్న రజినీకాంత్ చిత్రాన్ని ఈ పోస్టర్లో గమనించవచ్చు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ రూపొందిస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్న ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కథ అంతా కూడా జైలు చుట్టూ తిరుగుతోందట. ఇక జైలర్ గా రజనీకాంత్ ఎలా కనిపించబోతున్నారో చూడాలి. జైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడంతో పాటు సోమవారం నుండే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం ఇది. ఇందులో రజనీకాంత్ సరసన హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా తెలియజేయలేదు. అయితే ఇదివరకే రోబో చిత్రంలో తలైవాతో కలిసి నటించిన ఐశ్వర్యారాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు