Allari Naresh: “ఉగ్రం” ఫస్ట్ లుక్

అల్లరి నరేష్.. హాస్య కథానాయకుడిగా చక చకా 50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ఆమధ్య వరుస అపజయాలతో కాస్త సతమతమవుతున్న అల్లరి నరేష్ చివరగా 2021 లో వచ్చిన ” నాంది” సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. హరీ శంకర్ శిష్యుడు విజయ్ కనకమెడల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇదే కాంబినేషన్ లో తాజాగా ” ఉగ్రం” అనే సినిమా స్టార్ట్ అయింది. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు.

సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వీపు భాగంలో కత్తి గుచ్చుకొని ఒంటినిండా రక్తంతో ఉగ్రరూపం లో కనిపిస్తున్నాడు అల్లరి నరేష్. ఆక్రోషంతో హీరో అరుస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిగానున్నాయి. నాంది తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు