Tollywood: బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రజినీకాంత్

మహా నటుడు “నందమూరి తారక రామారావు” శత జయంతి వేడుకలు ఏప్రిల్ 28న విజయవాడ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా ఈ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖుల కన్నా రాజకీయ ప్రముఖులే ఎక్కువగా హాజరయ్యారు. దీన్ని బట్టి బహుశా టీడీపీ పార్టీ అద్వర్యం లో ఈ వేడుక జరిగింది అనుకోవచ్చు.

అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం రజినీకాంత్. ఇక ఆ స్పీచ్ లో ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు రజినీకాంత్. వీళ్లిద్దరు కలిసి నటించిన టైగర్ చిత్ర విశేషాల గురించి కూడా చెప్పాడు. ఈ క్రమంలో భాగంగా బాలకృష్ణ గురించి రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ లో బాలకృష్ణ అద్భుతమైన నటుడని తన తండ్రిలాగే అన్ని రకాల పాత్రలు చేయగల నటుడని అన్నారు. అంతే కాక బాలకృష్ణ చేసే పెర్ఫార్మన్స్ లు, ఫైట్ లు ఎవ్వరు చేయలేరని, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి నటులు కూడా ఈయన చేసే ఫైట్ ల ముందు దిగదుడుపే అని అన్నారు.

అయితే ఈ కామెంట్లు ఒక రకంగా బాలకృష్ణ అభిమానులను సంతోష పెడుతున్నా మరో రకంగా ట్రోలింగ్ కావడానికి అవకాశంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ చేసిన సినిమాల్లో ఎక్కువ గా ట్రోల్ అయ్యేది ఈ ఫైట్ సీన్లే. రీసెంట్ గా వచ్చిన వీర సింహారెడ్డి లో కార్ ని కాలితో తన్నే సీన్ కుడా బాగా ట్రోల్ అయింది. ఈ కామెంట్స్ వల్ల సోషల్ మీడియా లో మేమర్స్ కి మాత్రం మంచి మ్యాటర్ దొరికింది. మీమ్స్ లో రజిని చేసిన వ్యాఖ్యలకు బాలయ్యని తిట్టాడా, పొగిడాడా? అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు