Box office: ఏమి లేదన్నారు అప్పుడే వంద కొట్టింది

పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపెడుతుంది. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ సినిమా యొక్క మొదటి భాగం 2022 సెప్టెంబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ యొక్క రెండో భాగం PS 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ తారాగణం తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించగా, విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో హీరోయిన్లు గా నటించగా ఇక ప్రకాష్ రాజ్, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, పార్తీబన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందించాడు.

అయితే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా విడుదలైన తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి భాగం లాగానే ఈ సినిమా కూడా ఎక్కువ నిడివితో సాగదీశారని, డ్రామా తప్ప ఏమి లేదని విమర్శకులు చెప్పడం జరిగింది. అయితే ఇవేమి పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని అడ్డుకోలేవు. మొదటి భాగం అంత కాకపోయినా రెండో భాగం బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు 58 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో హోల్డ్ చేసి 50 కోట్ల వరకు వసూలు చేసింది.

తెలుగు రాష్టాల్లో కూడా మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ వసూలు చేసింది. తెలుగు లో 10 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో దాదాపు 3 కోట్లు వసూలు చేయడం తో మరో ఏడు కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక PS 2 విడుదలైన రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 109 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేయగా, 53 కోట్ల షేర్ సాధించింది. అయితే ఈ సినిమా 172 కోట్ల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 118 కోట్లు వసూలు చేయాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు