రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి, ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ప్రభావం వల్ల ఆలోచనా తీరు మార్చుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఒక సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమా అనౌన్స్ చేసిన మెగాస్టార్, ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే రిజల్ట్ ని బట్టి తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్నది డిసైడ్ అయ్యే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ కారణంగానే గ్యాప్ దొరికినప్పుడల్లా చాలా మంది దర్శకులు తెచ్చే కథలు వింటున్నా కూడా దేనినీ ఫైనలైజ్ చేయలేదు.తమిళ్ సినిమా ‘వేదాళం’ కి రీమేక్ గా రూపొందుతున్న ‘భోళాశంకర్’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. అయితే, సినిమా రిలీజ్ డేట్ లో మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. బహుశా ఆగస్టు కంటే దసరా సీజన్లో రిలీజ్ చేయటం బెటర్ అని భావించారేమో మేకర్స్.
Read More: BRO: ఉస్తాద్ అంటారు? ఓజి అంటారు? మరి “వీరమల్లు” పరిస్థితేంటి?
అసలే రీమేక్ సినిమా అంటూ భోళా శంకర్ పై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పైగా మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇవ్వటం పట్ల కూడా కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పులు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.
For More Updates :
Read More: Tollywood: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ లవర్ ?
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్...
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...