Ramabanam : హీరో గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్ షూటింగ్ లో కొట్టుకున్నారా..?

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం “రామబాణం”. ఈ సినిమాలో మ్యాచో స్టార్ సరసన కిలాడి బ్యూటీ డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. అలాగే ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై భారీ స్థాయిలో నిర్మితమైన రామబాణం మూవీ మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున చేపడుతుంది మూవీ యూనిట్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ తేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గోపీచంద్. అయితే ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. రామబాణం షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీవాస్ తో జరిగిన గొడవలపై నేరుగా ప్రశ్నించారు తేజ. వీటిపై గోపీచంద్ స్పందిస్తూ.. తను గొడవలు పడే రకం కాదని.. తనకి శ్రీవాస్ తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉందని, అప్పుడు డైరెక్టర్ తో ఎలాగో ఎడిటింగ్ లో పోయే సీన్లను తీయడం ఎందుకు డబ్బులు దండగ అన్న ఉద్దేశంతో ఓ మాట చెప్పాను అన్నారు. దానికి డైరెక్టర్ వినకుండా మళ్ళీ కావాలంటే చేయలేము కదా అని తాను అనుకున్నట్లే షూటింగ్ చేశారు. తరువాత నేను ముందే హెచ్చరించినట్లుగా సీన్లు ఎడిటింగ్ లో తీసేయడంతో శ్రీవాస్ రియలైజ్ అయ్యారు. మా మధ్య ఇదే జరిగిందని చెప్పుకొచ్చారు గోపీచంద్. దీంతో తనకు, శ్రీవాస్ కి గొడవలు జరిగాయని వార్తలు రాశారని క్లారిటీ ఇచ్చారు

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు