Radhika Apte : సాధారణ యువతిలా..

‘రక్త చరిత్ర’ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది రాధిక ఆప్టే. ఆ తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ భామకి ఎంతో పాపులారిటీ వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ భామ అన్ని విధాలుగాను అభిమానులను ఆకట్టుకుంది.

ఈమె ఏది మాట్లాడినా ఒక సంచలనం, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండడం ఆమె స్టైల్. అయితే రాధిక ఆప్టే తాజాగా నటించిన చిత్రం “విక్రమ్ వేద”. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే మాట్లాడుతూ.. మూవీ ఇండస్ట్రీలో సెలబ్రెటీ ప్రవర్తనకు కొన్ని నిబంధనలు పాటించాలని చెబుతుంటారని.. అయితే వాటిని తాను ఎప్పుడు పాటించలేదని చెప్పింది.

ఓ సాధారణ యువతి లానే తాను ప్రవర్తిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. హీరోయిన్ అన్న తర్వాత లగ్జరీ కారులో దిగాలి, దుస్తులు మళ్లీ రిపీట్ చేయకూడదు, షూటింగ్ కి ఆలస్యంగా రావాలి.. ఇలాంటి రూల్స్ తనకి నచ్చవని స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ తన మనసుకు నచ్చినట్లుగానే ఉండాలనుకుంటానని వెల్లడించింది. తాను అలా ఉన్నప్పటికీ తన కెరియర్ సంతృప్తికరంగానే సాగుతుందని చెప్పింది. కాగా ప్రస్తుతం రాధిక ఆప్టే ” మౌనిక ఓ మై డార్లింగ్” అనే సినిమాలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు