Adipurush : కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ” ఆది పురుష్”. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఆది పురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించారు. రామాయణంలో కీలక పాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

అయితే ఇటీవల దసరా వేడుకలలో భాగంగా ఈ మూవీ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీజర్ లో ప్రభాస్ లుక్ తో పాటు, సైఫ్ అలీ ఖాన్ లుక్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ ఆ తప్పులను సరి చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శకుడు ఓంరౌత్.

వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. టీజర్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వి.ఎఫ్.ఎక్స్, సీజీ వర్క్ కోసం మరో 100 కోట్లని అదనంగా కేటాయించి ఆది పురుష్ టీం ఖర్చు చేయబోతోంది. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు సోమవారం ఉదయం దర్శకుడు ఓంరౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సినిమా వాయిదా పడడంతో డార్లింగ్ అభిమానులు నిరాశ చెందుతూ పోస్టులు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు