Pushpa-2: వేసవి కానుకగా

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రంపుష్ప 2. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా ఈ పుష్ప ది రూల్ ను దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వేసిన స్టెప్ లు, డైలాగ్స్, పాటలు అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాయి.

పుష్ప మొదటి భాగం అనుకున్న దాని కంటే భారీ హిట్ కావడంతో పుష్ప రెండో భాగం పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ అంచనాలను అందుకోవడానికి పుష్ప 2 స్క్రిప్ట్ లో సుకుమార్ అనేక మార్పులు చేశారు. ఇటీవల స్క్రిప్ట్ పనులు ముగిశాయని తెలుస్తుంది. దీంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి పుష్ప 2 రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. తొలి షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దీని కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రాబోతున్నారట.

ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ పుష్ప 2 ను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం వస్తున్నట్లు టాక్. కాగా సీక్వెల్ లో రష్మికా మందన్నా, సునిల్, ఫహద్ ఫజిల్ తో పాటు కొత్తగా సాయి పల్లవి, ప్రియమణి నటించబోతున్నారని సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు