Pawan kalyan : ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్‌లో గ్యాంగ్ లీడర్ హీరోయిన్ !

పవన్ కళ్యాణ్ , సుజీత్ కాంబినేషలో వస్తోన్న చిత్రం ” OG” ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరగనుంది. దీనికి సంబంధించిన లొకేషన్స్ అన్ని ఫైనల్ అయిపోయాయి. ప్రస్తుతం టీం అంత ముంబైకి షిఫ్ట్ అయిపోయారు . వచ్చే వారం పవన్ కళ్యాణ్ ముంబై కి వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు OG షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ లో ఉన్నారు. ఈ వీక్ చివర్లో ఆయన ముంబై కి ప్రయాణమవుతారు.

అయితే OGకి సంబంధించి పవన్ తప్ప మిగితా నటినటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు.సుజీత్ ఈ మధ్యనే ప్రియాంక మోహన్ ని కలిసి OG కథ వినిపించారంట.. వెంటనే ప్రియాంక ఎక్సైట్ అయ్యి ఎస్ చెప్పి డేట్స్ కూడా ఇచ్చ్చేసిందంట. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యే ముంబై షెడ్యూల్ లో పవన్ తో పాటు ప్రియాంక మోహన్ కూడా పాల్గొనబోతున్నారు

పవన్ ప్రస్తుతం చేసే సినిమాలన్నిటిలో ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా OG నే, రీమేక్ సినిమా లలో పవన్ ని చూసి, చూసి విసిగిపోయిన ఫ్యాన్స్ పవన్ స్ట్రయిట్ సినిమా చేస్తే చూడాలని ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క “ఉస్తాద్ భగత్ సింగ్” తేరి రీమేక్ చేస్తున్నారు అనే న్యూస్ వైరల్ అవడంతో మళ్ళీ ఇంకో రీమేక్ అని, ఆ సినిమా పై ఆశలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్.. దానికి తోడు పవన్ ఆల్రెడీ వినోదయ సితం రీమేక్ లో తన పార్ట్ షూట్ కంప్లిట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చాడు అని హ్యాపీ ఫీల్ అయ్యేలోపు , రీమేక్ సినిమాలకి పవన్ ఒకే చెప్తుండటం తో ఫ్యాన్స్ నిరాశ తప్పలేదు . అప్పుడే సుజీత్ కాంబో సినిమా ని పవన్ ఎనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు. అందులోనూ పవన్ OGలో గ్యాంస్టర్ చేస్తుండటం తో వాళ్ళ అంచనాలు డబల్ అయ్యాయి.ఈ సినిమాని DVV దానయ్య నిర్మిస్తున్నారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు