Prabhas : ముచ్చటగా మూడు

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కృష్ణంరాజు వార‌సుడిగా ఈశ్వ‌ర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో నే మంచి స‌క్సెస్ సాధించాడు. ఇక త‌రువాత వ‌చ్చిన రాఘ‌వేంద్ర సినిమా అంత‌గా ఆక‌ట్టుకోక‌పోయినా వ‌ర్షం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు హిట్‌, ప‌ట్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ కెరీర్‌లో మాత్రం వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, బాహుబ‌లి సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో పాటు ప్ర‌భాస్ రేంజ్‌ని మార్చేశాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

ముఖ్యంగా ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా త‌రువాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ త‌రువాత వ‌చ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌య్యాయి. టాలీవుడ్ లో సాహో ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి విజ‌యం సాధించింది. రాధేశ్యామ్ సినిమా మాత్రం ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా విడుద‌ల కానుంది.

ఇటీవ‌లే ఆదిపురుష్ టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా యానిమేష‌న్ లేక నిజంగానే తెర‌కెక్కించారా అని విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. 3డీలో వ‌చ్చిన టీజ‌ర్ అభిమానుల‌ను కొంత మేర‌కు మెప్పించ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రోవైపు ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రెండో టీజ‌ర్ ని తీసుకొచ్చి ఆదిపురుష్ సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేయాల‌ని డైరెక్ట‌ర్ ఓంరౌత్ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న ఆదిపురుష్ సినిమా నుంచి రెండో టీజ‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

- Advertisement -

మ‌రోవైపు ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇప్ప‌టికే బిల్లా సినిమాను రీ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఈనెల 23న వ‌ర్షం సినిమాను విడుద‌ల చేయాల‌ని భావించినా థియేట‌ర్ల స‌మ‌స్య కార‌ణంతో వ‌ర్షం సినిమాను ఒక వారం రోజుల త‌రువాత రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి స‌లార్ నుంచి కూడా ఏదో ఒక అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదేవిధంగా మారుతి-ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే మూవీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు మారుతి ప్ర‌క‌టించారు. మొత్తానికి ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి ముచ్చ‌ట‌గా మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు రానున్నాయి. దీంతో ప్ర‌భాస్ పుట్టిన రోజు సంబరాల‌ను ఫ్యాన్స్ సంతోషంగా జ‌రుపుకోనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు