Tollywood : వామ్మో.. బరిలో ఉండలేం

సంక్రాంతి అంటే.. ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్లవరకు అందరికీ సంక్రాంతి అంటే ఇష్టమే. అలాగే సినిమా వాళ్లకు కూడా సంక్రాంతి కలిసొస్తుంది. ఎందుకంటే.. సంక్రాంతి సీజన్ ల్లో ఒక సినిమాను విడుదల చేస్తే, నిర్మాతలకు కలెక్షన్ల పండుగే. అందుకే సంక్రాంతి బరిలో తమ సినిమాలు దింపాలని అటు హీరోలు, ఇటు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ ఏడాది సంక్రాంతి పోరు అనుకున్నంత రసవత్తంగా జరగలేదు.

దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల మధ్య ఫైట్ గట్టిగానే ఉండబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీని కోసం ఫ్యాన్స్ దాదాపు రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇది సంక్రాంతికే రాబోతుంది. దీంతో పాటు ‘అఖండ’విజయం తర్వాత బాలయ్య NBK107తో సంక్రాంతికే థియేటర్ ల్లోకి రాబోతున్నాడు. గాడ్ ఫాదర్ హిట్ తో సూపర్ ఫాంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా MEGA154 (వాల్తేరు వీరయ్య) తో సంక్రాంతి పోరుకు సై అంటున్నాడు. దీంతో పాటు తలపతి విజయ్ నటిస్తున్న వారసుడు, అఖిల్ హీరోగా చేస్తున్న ఏజెంట్ కూడా సంక్రాంతి బరిలో ఉండనున్నాయి.

నిజానికి ఈ సినిమాలతో పాటు మరికొన్ని కూడా సంక్రాంతి రోజు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్యతో పాటు ప్రభాస్ సినిమా కూడా ఉండటంతో కొన్ని సినిమాల దర్శకనిర్మాతలు జంకుతున్నారు. వామ్మో సంక్రాంతి బరిలో మేం ఉండలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలా సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న సినిమాలన్నింటినీ ఆ సీజన్ కంటే ముందుగానే డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అలా డిసెంబర్ లో వచ్చే సినిమాల లిస్ట్ కూడా భారీగానే ఉంది. దీంతో డిసెంబర్ లో కూడా సంక్రాంతి అంతటి పోటీ నెలకొంది.

- Advertisement -

ప్రస్తుతం అందుతున్న సోర్స్ ప్రకారం.. రవితేజ నటిస్తున్న ధమాకా, నాని నిర్మిస్తున్న హిట్ – ది సెకండ్ కేస్, ధనుష్ హీరోగా వస్తున్న సర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ కాంబో లో వస్తున్న మూవీ కూడా డిసెంబర్ బరిలో ఉండబోతున్నాయి. దీంతో సంక్రాంతికి ఎంత క్రేజ్ ఉందో.. అలాంటి క్రేజ్ ఇప్పుడు డిసెంబర్ కు కూడా ఉందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు