Mallidi Vasishta : చిన్నవాడు కాదు.. పాన్ ఇండియా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు దాటిన‌ప్ప‌టికీ ఇంకా యంగ్ కుర్రాడిలా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను మెప్పిస్తూనే ఉన్నాడు. ర‌జినీకాంత్ చాలా సినిమాల్లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ముఖ్యంగా రోబో సినిమా త‌రువాత నుంచి రజినీకాంత్ చేస్తున్న సినిమాలు ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోవ‌డం లేద‌నే చెప్పాలి. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమా విడుద‌ల‌వుతుందంటే ప్రేక్ష‌కుల్లో అదో క్రేజీ క‌నిపించేది.

ఇక ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన క‌బాలీ, లింగా, పేట‌, రోబో 2.0 వంటి సినిమాలు ర‌జినీకాంత్‌ని నిరాశ‌ప‌రిచాయి. ద‌ర్బార్ సినిమా కాస్త ప‌ర్వాద‌నిపించింది. గ‌త ఏడాది అన్నాత్తై తెలుగులో పెద్ద‌న్న‌గా ప‌లుక‌రించాడు. కానీ ఈ సినిమా కూడా దారుణ‌మైన ఫ‌లితాన్ని అందుకుంది. తాజాగా డాక్ట‌ర్‌, బీస్ట్ సినిమాల ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ తోసినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి జైల‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి టైటిల్ తో పాటు ర‌జినీకాంత్ లుక్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. రోబో సినిమా త‌రువాత ర‌జినీకాంత్ సినిమాలు అంత‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ సాధించ‌లేదు.

తాజాగా టాలీవుడ్ హీరో క‌ళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాను ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం సూప‌ర్ హిట్ సాధించింది. బింబిసార ద‌ర్శ‌కుడు వశిష్ట్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కి ఓ క‌థ వినిపించాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం జైల‌ర్ సినిమా చేస్తున్న ర‌జినీకాంత్ వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడో లేదో చూడాలి మ‌రి. ఒక‌వేళ ఈ ద‌ర్శ‌కుడితో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ సినిమా చేస్తే మాత్రం వ‌శిష్ట్ పాన్ ఇండియా ద‌ర్శ‌కుడిగా మారిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు