Tollywood : ఆ విషయంలో కూడా ప్రభాసే నంబర్ వన్

ప్రభాస్ అంటే ఒకప్పుడు తెలుగు హీరో మాత్రమే కానీ..ఇప్పుడు ప్రభాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుడు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో అడుగుపెడుతున్న చిన్న, చిన్న దర్శకుల ఉంచి పెద్ద దర్శకుల వరకు అందరు ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.

తెలుగులో అగ్ర హీరోలుగా చలామణి అవుతున్న హీరోలంతా ఏడాదికి ఒక సినిమా రెండు సినిమాలు చేయడానికే స్ట్రగుల్ అవుతున్న ఈ రోజుల్లో ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మారుతీ దర్శకత్వంలో సినిమా కమిటై ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తూ బిజీ గా ఉన్నారు. కాని ఎంత బిజీ గా ఉన్న కూడా సినిమాలు చూడటం, చూసిన సినిమా నచ్చితే వెంటనే సినిమాని ప్రమోట్ చేయడం ఆయనకి హాబీగా అయిపొయింది.

రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయిన దసరా సినిమా విజయం సాధించినప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ను , హీరో నానికి అభినందనలు తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు గతంలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాని కూడా ప్రభాస్ దగ్గరుండి ప్రమోట్ చేసాడు. అప్పటికి ఆయన ముంబై లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో ఉన్నకూడా, ఆకాష్ ని ముంబై కి పిలిపించుకొని మరి సినిమాని ప్రమోట్ చేసాడు. ఇలా ప్రభాస్ ఏడాదికి దాదాపు వందకి పైగా సినిమాలకి ఆయన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నరంట. పక్కవాళ్ళ సినిమాని ప్రమోట్ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిందే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ప్రభాస్ ఇలాంటివేవీ పట్టించుకోకుండా చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా ప్రభాస్ ఈ విధంగా ప్రమోట్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు