Happy Birthday: థలా అజిత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు

అజిత్ కుమార్. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. థలా అజిత్ గా, వాలిగా తమిళనాట టాప్ హీరోగా కొనసాగుతున్న అజిత్ కుమార్ ఈరోజు అనగా మే 1 న తన పుట్టినరోజు. ఈ సందర్బంగా అజిత్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అజిత్ కుమార్ తండ్రి పి. సుబ్రహ్మణ్యం ఆయన ఒక మలయాళీ. అజిత్ తల్లి మోహిని సింధీ. ఆవిడ ఒక బెంగాలీ. వీళ్ళకి కలిగిన రెండో సంతానమే అజిత్ కుమార్.

తెలంగాణా లో సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అయినా సౌత్ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భాషలతో పాటు హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడగలడు. అయితే అజిత్ కుమార్ కి చిన్నప్పుడు అస్సలు తమిళ్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ అజిత్ ఒక స్టార్ హీరో. అయితే అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం, అతడు దేశంలో అత్యుత్తమ బైక్ రేసర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్ ఫార్ములా సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు.

ఇక అజిత్ కుమార్ 1992 లో అమరావతి అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. అయితే అదే సంవత్సరం ప్రేమ పుస్తకం అనే తెలుగు చిత్రం లోను హీరోగా నటించాడు. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీస్ ఎక్కువగా చేస్తూ వచ్చాడు అజిత్. 1996 లో వచ్చిన “ఆశ ఆశ ఆశ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 1999 లో వచ్చిన “వాలి” సినిమా తో స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాలో చెవిటి, మూగవాడిగా విలక్షణమైన నటన చూపించాడు. ఆ తర్వాత “కండుకొండైన్ కండుకొండైన్” , “పోవెళ్ళై ఉన్ వసం” చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.

- Advertisement -

2006 లో వచ్చిన తిరుపతి సినిమాతో మాస్ హీరోగా కమర్షియల్ హిట్ కొట్టిన అజిత్, 2007లో బిల్లా సినిమాతో స్టైలిష్ హీరోగా తమిళ నాట సూపర్ స్టార్ డమ్ ని దక్కించుకున్నాడు. మంగాత్తా, ఆరంభం, వీరం, వేదాళం సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. అజిత్ రీసెంట్ గా పొంగల్ కి “తునీవు” సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తమిళ్ లో రజినీకాంత్ తరువాత నెంబర్ 1 స్థానానికి చాలా దగ్గరగా ఉన్నాడు అజిత్. అయితే అజిత్ కుమార్ ఇతర హీరోల్లాగా బయట ప్రమోషన్లలో ఎక్కువగా కనబడడు. తమిళం లో ఉన్న తన ఫ్యాన్ బేస్ కారణంగానే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.

అజిత్ కుమార్ తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అజిత్ నటించిన గ్యాంబ్లర్, ఎంతవాడు గాని, విశ్వాసం చిత్రాలు ఇక్కడ సూపర్ హిట్లయ్యాయి. అజిత్ కుమార్ తమిళ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన షాలిని ని పెళ్లిచేసుకున్నాడు. వీళ్లకి ఇద్దరు పిల్లలు. అజిత్ కుమార్ షాలిని కలిసి నటించిన సినిమా అమరకాలం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విదాముయార్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. మరొకసారి filmify టీమ్ తరపున అజిత్ కుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు