Agent : అక్కినేని అఖిల్ కి ఆ దోషం – వేణు స్వామి సంచలనం

రాజకీయ, సినీ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడంతో పాటు వాటిలో ఏమైనా దోషాలు ఉంటే చెప్పి వారితో అందుకు పరిహారాలు చేయిస్తుంటారు. వేణు స్వామి చెప్పినవి గతంలో ఎవరు నమ్మకపోయినప్పటికీ.. సమంత, నయనతార విషయంలో చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో అందరూ వేణు స్వామి చేత పరిహారాలు చేయించుకుంటున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో, ఒక యంగ్ హీరోయిన్ చనిపోతారంటూ ఆయన రెండు నెలల కిందట వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పేరు అందరి నోళ్ళలో నానుతుంది.

ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి కూడా వేణు స్వామి సంచలన విషయాలు చెప్పారు. అయితే తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ పరాజయాలకు కూడా ఆయన కారణం చెప్పారు. అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ అంత సాఫీగా సాగడం లేదన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో “ఏజెంట్” అనే మూవీని రూపొందించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఆ దోషం ఉన్నప్పుడు ఇతరుల సలహాలు మిస్ ఫైర్ అవుతాయని.. కనుక అఖిల్ హిట్ కొట్టాలంటే సినిమాల విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడదని, తన సొంత నిర్ణయాలతోనే కథలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అప్పుడే అఖిల్ కి సక్సెస్ వస్తుందని తెలిపారు వేణు స్వామి.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు