సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. మహేష్ పాత్రను గత సినిమాల తరహాల్లో కాకుండా, డైరెక్టర్ పరశురామ్ కొత్తగా డిజైన్ చేశాడు.
కాగ ఈ సినిమాలో ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా మధ్యలో నటుడు సుబ్బరాజు కు హీరో మహేష్ ఫోన్ చేస్తాడు. అ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రింగ్ టోన్ గా వినిపిస్తుంది. ఇలా సూపర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాటను రింగ్ టోన్ గా పెట్టడంలో ఉన్న అంతర్యమేమీటో దర్శకుడు పరశురామ్ కే తేలియాలి.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుండి సూపర్ స్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. తమ హీరో అంటే.. తమ హీరోనే గొప్ప అని ఫ్యాన్ అనుకునే తరుణంలో, హీరోలు ఒకరినొకరు గౌరవించుకుంటారని, వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని సినీ విశ్లేషకులు అంటున్నారు.
భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ.. “మేము మేము బాగుంటాం. కానీ మీరే ఇంకా బాగుండాలి” అని ఫ్యాన్స్ ను ఉద్ధేశించి చెప్పినా కానీ కొంత మందిలో మార్పు రావడం లేదు.