Paayal Rajput: క్లిక్ అవుతుందా.?

పాయల్ రాజపుత్ తొలి చిత్రం RX100లో తన అగ్రెసివ్ స్కిన్ షో మరియు లిప్ కిస్సింగ్ సన్నివేశాలతో అప్పట్లో టిక్‌టాక్‌లో సంచలనంగా మారింది. ఆ సినిమాతో పాయల్ రాజ్‌పుత్, టాలీవుడ్‌లో కూడా సంచలన హీరోయిన్‌గా మారింది. అయితే, మొదటి సినిమా విజయం స్టార్‌డమ్‌
తెచ్చిపెట్టదు.

RX100 విజయం తర్వాత, పాయల్ రాజ్‌పుత్ తెలుగులో వెంకీ మామ మరియు డిస్కో రాజా లాంటి సినిమాలతో పాటు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌తో దాదాపు అరడజను సినిమాలు చేసింది, కానీ ఆమెకు అనుకూలంగా ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు.
పాయల్ రీసెంట్ గా ఆది సాయి కుమార్‌తో చేసిన ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో ఆమె చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేవు. ప్రస్తుతం పాయల్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న “జిన్నా” చిత్రంలో నటిస్తుంది.

ఈ సినిమా క్లిక్‌ అయితేనే, పాయల్‌కు తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయి, లేదంటే కష్టమే అని చెప్పాలి. తాజాగా రిలీజైన జిన్నాలోని ‘గోలీ సోడా’ పాట కాస్త ఆశాజనకంగా ఉండడంతో పాటు పాయల్ గ్లామరస్ పెరఫార్మన్స్ కూడా బాగుంది. కానీ చిత్రం ఎలా ఉండబోతుందో విడుదల అయితే కానీ చెప్పలేము. ఏదేమైనా జిన్నా ఫలితం పైనే పాయల్ కెరియర్ ఆధారపడివుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు