Chatrapath: నాకోసం ఆ హీరో ఫుడ్ ఆర్డర్ చేసేవాడు !

బాలీవుడ్ నటి నూష్రత్ భారుచ్ఛ యాక్టర్ శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమా నిరాశపరచటంతో సౌత్ సినిమాలు ఆమెకి సెట్ అవ్వవు అనుకుందో ఏమో గాని మళ్ళీ ఈవైపు రాకుండా బాలీవుడ్ లోనే పర్మినెంట్ గా సెటిల్ అయింది ఈ భామ.

ప్రస్తుతం నూష్రత్ భారుచ్ఛ.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తోన్న హిందీ చిత్రం ఛత్రపతి లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. 2005 లో ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఛత్రపతికి హిందీ రీమేక్ గా ఈ సినిమాని తీస్తున్నారు. వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాలను ఎప్పటికప్పడు హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూండటం వల్ల , యూట్యూబ్ లో ఈ సినిమాలు మిలియన్ల వ్యూస్ ని సాధించి రికార్డ్స్ క్రియెట్స్ చేస్తుండటంతో, బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ సినిమా చేయాలని ఆశించి అన్ని కమర్షియల్ హంగులు ఉన్న ఛత్రపతి సినిమాని రీమేక్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నూష్రత్ భారుచ్ఛ హీరోయిన్ గా నటిస్తుంది. మే 12 న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నూష్రత్ భారుచ్ఛ.. బెల్లంకొండ శ్రీనివాస్ ని పొగడ్తలతో ముంచేసింది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీనివాస్ తనని బాగా చూసుకునే వాడని కొన్ని సార్లు తన కోసం ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేవాడిని, సినిమా అంటే తనకి చాలా ప్యాషన్ కొన్ని సార్లు తాను వర్కౌట్స్ చేయడం మానేసిన కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం మానలేదని చాలా డెడికేషన్ తో ఉండేవాడని ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ ని పొగడ్తల ప్రవాహంలో నింపేసింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు