Nani30: షూటింగ్ టైమ్ లో సాగరతీరాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్

సీతారామం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సీతగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ముంబైకి చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టినా ఎక్కువ ఫేమ్ వచ్చింది మాత్రం తెలుగులోనే. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం చిత్రం తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది. అంతే కాదు ఈ సినిమా లో హీరోను మించి తన అద్భుతంగా నటించింది. అందుకే తెలుగులో వరుస బెట్టి ఆఫర్లు వస్తున్నాయి. అయినా మృణాల్ తొందరపడకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఈ మధ్యనే హిందీలో ‘గుమ్రా’ అనే సినిమా చేయగా ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ న్యాచురల్ స్టార్ నాని 30 వ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. మూవీకి సంబంధించిన ప్రధాన తారాగణం ఈ షూట్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ లో మృణాల్ ఠాకూర్ కూడా ఉంది.

అయితే షూటింగ్ జరిగిన తర్వాత సాయంత్రం బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియో ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. సాయంత్రం పూట సూర్యాస్తమయం అవుతున్న స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నాని30 సినిమా 2023 డిసెంబర్ 21 న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు