Ram charan : బయోపిక్ లో రామ్ చరణ్

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తన తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా కలియుగ భీముడిగా పేరుగాంచిన ప్రముఖ మల్ల యోధుడు రాంమూర్తి నాయుడు బయోపిక్ అన్నట్టు వార్త వినిపిస్తోంది. విజయనగరం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన రామ్మూర్తి ఇండియన్‌ హెర్క్యులస్‌గా పేరు పొందాడు. ఏనుగుని సైతం తన ఛాతి మీద 5 నిమిషాల వరకు ఉంచుకోగల మహా బలశాలి రామ్మూర్తి నాయుడు.

గతంలో కూడా రామ్మూర్తి బయోపిక్ చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా అందరు విఫలం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నాన్ని బుచ్చిబాబు చేస్తున్నాడు. RRR సినిమాలో అల్లూరి సీతరామ రాజు పాత్రలో కనిపించిన రామ్ చరణ్ మళ్ళీ అలాంటి ఒక వీరుడి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. లుక్స్ వైస్ చూసుకున్న కూడా రామ్ చరణ్ కి రామ్మూర్తి నాయుడికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఆయన ఆహార్యానికి ఈ పాత్ర సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే రామ్మూర్తి కుటుంబసభ్యులతో కూడా బుచ్చిబాబు చర్చలు జరిపినట్టు సమాచారం

- Advertisement -

గేమ్ చెంజర్ సినిమా తరువాత రామ్ చరణ్ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉండటం వల్ల ఈ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారు రామ్ చరణ్. RRR ప్రమోషన్స్ , గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ పనుల వల్ల సరిగా ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోతున్నాడని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఈ లాంగ్ బ్రేక్ తరువాత రామ్ చరణ్, బుచ్చిబాబుల సినిమా మొదలవబోతుంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు