Nitya Menon: ఇంతమంది హీరోలతో ఎఫైర్ పెట్టుకుందా..?

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఒకరు. నాచురల్ స్టార్ నానితో కలిసి అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. నటనతో పాటు తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా బయట పెట్టింది. స్టార్ హీరోయిన్ గా రాణించినా ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ మధ్యకాలంలో సినిమాలలో జోష్ తగ్గించిన నిత్యామీనన్.. భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అయితే నిత్యామీనన్ స్టార్ హీరోలతో పాటు ఇప్పటివరకు చాలామంది నటులతో ప్రేమాయణం నడిపించిందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఈమె తొలి సినిమా అలా మొదలైంది చిత్రంలో నటించే సమయంలోనే నానితో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వార్తలు కనుమరుగయ్యాక మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ తో కూడా నిత్యమీనన్ ఎఫైర్ పెట్టుకుందని.. అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నిత్యామీనన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే రూమర్స్ కూడా వినిపించాయి.

అయితే ఈ విషయంలో మమ్ముట్టి కలగజేసుకోవడంతో నిత్యమీనన్ – దుల్కర్ సల్మాన్ ల ప్రేమ బ్రేకప్ అయిందని సమాచారం. ఆ తర్వాత మరో టాలీవుడ్ హీరో నితిన్ తో కలిసి ఈమె ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలలో నటించింది. ఈ సినిమాల షూటింగ్ సమయంలో కూడా నిత్యమీనన్ – నితిన్ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ వీరి పెళ్లికి నితిన్ అక్క నిఖితారెడ్డి ఒప్పుకోలేదట. దాంతో వీరి ప్రేమ మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది.

- Advertisement -

ఇక ఆ తర్వాత మరో యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి ఈమె మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలో నటించింది. ఈ సమయంలోనే శర్వానంద్ నిత్యా మద్య మంచి బంధం ఏర్పడిందని, ఆ తర్వాత వీళ్ళు పబ్బులు, పార్టీలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారట. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ఇద్దరు వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు.

ఆ తర్వాత ఈమె కన్నడ స్టార్ హీరో సుదీప్ తో ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో అతనితో కూడా ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఏకంగా రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారట. సుదీప్ తన భార్యకి విడాకులు ఇచ్చి మరీ నిత్యామీనన్ ని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా భావించారట. అయితే ఈ విషయం తెలిసిన సుదీప్ కూతురు కన్నడ పరిశ్రమలోని కొంతమంది పెద్దలను కలిసి నిత్యమీనన్ కి వార్నింగ్ ఇప్పించిందట.

దాంతో వీరి ప్రేమ అక్కడితోనే ముగిసిపోయింది. ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈమె ఇంత మందితో ఎఫైర్ నడిపిందన్న రూమర్లు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు