Krithi shetty : నాగ చైతన్య “కస్టడీ “ఫస్ట్ సింగిల్

నాగ చైతన్య , క్రితి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ” కస్టడీ “. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదట్లో అంత తమిళ్ సూపర్ హిట్ అయినా “మానాడు” సినిమాని రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చ్చాయి. అయితే రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా “మానాడు” సినిమాని పోలి ఉండటంతో అందరు మానాడు రీమేక్ అయ్యుంటుంది అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ తో ప్రేక్షకుల డౌట్స్ అన్ని క్లారిఫై చేసారు మేకర్స్. “నిజం నా కస్టడీ లో ఉంటుంది” అని చెప్పే నాగ చైతన్య డైలాగ్స్ తో టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది,

నాగ చైతన్య ఈ మూవీలో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. “ధ్రువ” సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అరవింద్ స్వామి ఈ చిత్రం లో మెయిన్ విలన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12 న విడుదలకి సిద్దమవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. తమిళ్, తెలుగు రెండు భాషలలోనూ సినిమాని ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అయితే మే రెండో వారంలోనే రిలీజ్ ఉండడంతో ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు.

ఇటీవలే నాగ చైతన్య మల్లరెడ్డి అన్యువల్ డే లో ముఖ్య అతిథిగా హాజరయి, కస్టడీ మూవీ గురుంచి చెబుతూ, “మీకు నచ్చే సినిమా తీసాం, ఖఛ్చితంగా మీకు నచ్చుతుంది” అని స్టూడెంట్ తో అన్నారు. కస్టడీ సినిమా పై యూనిట్ అంత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. వెంకట్ ప్రభు తమిళ్ లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుడు. కథని వైవిధ్యంగా, వినోదంతో మాస్ ఎలిమెంట్స్ తో సినిమాని ప్రెసెంట్ చేస్తారు. చాలా రోజుల నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నాగ చైతన్య మరి ఈ సినిమాతో నైనా మంచి మాస్ హిట్ కొడతాడో లేదో, మే 12 న తెలుస్తుంది. కాగా, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు