Shaakuntalam: సమంత సినిమాకు ముందు జాగ్రత్త వహిస్తున్న గుణశేఖర్?

టాలీవుడ్ బ్యూటీ సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా ను డైరెక్ట్ చేసారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన సొంత బ్యానర్ అయిన “గుణ టీమ్ వర్క్స్” పైన 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో పురాణాల కి సంబంధించిన కథతో వస్తున్న ఈ సినిమాపైన ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో సమంత కాస్ట్యూమ్స్ కోసమే గుణ శేఖర్ 14 కోట్లు ఖర్చు పెట్టి నగలు డిజైన్ చేయించాడు. గతంలో తీసిన రుద్రమదేవి లో అనుష్క క్యారెక్టర్ కోసం కూడా ఈయన 5 కోట్లు ఖర్చు చేశాడు.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పైన ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది.

అదేంటంటే డైరెక్టర్, నిర్మాత అయిన గుణశేఖర్ అందరికంటే ముందుగా 11 నుంచి ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్. పి, శ్రీరామ్ సేన తదితర హిందూ సంస్థల పెద్దలకు “శాకుంతలం” స్పెషల్ ప్రీమియర్ షో లు వేస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఇతిహాసాలపై తీసిన సినిమా కాబట్టి ముందుగా వాళ్ళకి చూపిస్తే ఏ గొడవ ఉండదు అని అనుకోవచ్చు.

- Advertisement -

ఎందుకంటే గతంలో వచ్చిన రుద్రమ దేవి, సైరా సినిమాల్లో చరిత్రను వక్రీకరించారని కొన్ని వాగ్వాదాలు జరిగాయి. ఇక కొన్నేళ్ల కిందట హిందీలో వచ్చిన పద్మావత్ సినిమాపై కర్ణి సేన, ఇతర హిందూ సంఘాలు చరిత్రని చాలా వక్రీకరించారని సినిమా విడుదలని అడ్డుకుంటామని ఎంత గొడవ చేసారో తెలిసిందే. ఆ సినిమా డైరెక్టర్ వాళ్ళకి సినిమా చూపించి వివరణ ఇస్తే గాని వాళ్ళు శాంతించలేదు. ఇప్పుడు శాకుంతలం సినిమాకి కూడా ఇలాంటి ఇబ్బంది కలగొచ్చని భావించి ముందు జాగ్రత్తగా వాళ్ళకి సినిమా చుపిస్తున్నారని సమాచారం.

ఇలా చేస్తే సినిమా బాగుంటే వాళ్ళు కూడా దగ్గరుండి ఈ సినిమాను ప్రమోట్ చేసి అందరికి చూపిస్తారు. ఇక ఈ సినిమాలో సమంత శాకుంతలగా నటించగా, దుర్వాస మహర్షి గా మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో నటించాడు. గౌతమి, మధుబాల, దేవ్ మోహన్, జిష్షు సేన్ గుప్తా, కబీర్ సింగ్, అనన్య నాగళ్ళ, కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 14 న “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా 5 భాషల్లో విడుదలవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు