Mohan Babu: ఎంగిలి కూటికి ఆశపడి అవార్డు రాకుండా చేశారు – మోహన్ బాబు!

Mohan Babu

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. సినిమాలతోనే కాదు కాంట్రవర్సీలతో కూడా పాపులర్ అయిన ఈయన.. ముఖ్యంగా సినిమాలలో తన డైలాగ్ డెలివరీ టైమింగ్ తో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఎన్నో చిత్రాలలో హీరోగా , విలన్ గా కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే స్థానాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మోహన్ బాబును ఆయన అభిమానులు కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో కొన్ని వందల చిత్రాలలో నటించిన మోహన్ బాబు ఎంతోమంది ప్రేక్షకుల అభిమానం అందుకున్నారు.

పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే మోహన్ బాబు సినీ పరిశ్రమకు చేసినటువంటి సేవలను గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి ఆయనను సత్కరించారు.. అయితే ఈ క్రమంలో తనకు ఎన్నో అవార్డులు రానివ్వకుండా చాలామంది అడ్డుపడుతున్నారంటూ కూడా మోహన్ బాబు తెలియజేశారు. ఇప్పుడు మరొకసారి ఈ విషయం సరికొత్త చర్చలకు దారి తీసేలా కనిపిస్తోంది.

మోహన్ బాబు తన సినీ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు.. మోహన్ బాబు కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రాలలో అసెంబ్లీ రౌడీ, పెద్దరాయుడు, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి తదితర చిత్రాలు కూడా ఉన్నాయి అయితే తనకు రావలసిన ఎన్నో అవార్డులు రానివ్వకుండా కొందరు మాత్రమే అడ్డుపడుతున్నారంటూ మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ .. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సినిమాలను తాను చేశానని.. కానీ ఒక్క సినిమాకు కూడా అవార్డు రాలేదని.. తనకు రాకుండా చేశారని.. పెద్ద రాయుడు, రాయలసీమ రామన్న చౌదరి వంటి సినిమాలకు అవార్డు రాకుండా చేసిన వ్యక్తులు కూడా తనకు తెలుసు అని తెలిపారు.. అలాంటి వ్యక్తులకే తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పానని తెలిపారు.. అంతేకాకుండా తనకు అవార్డు ఇవ్వకుండా ఒక చెత్త సినిమాకు అవార్డు ఇచ్చారని కూడా చెప్పానని తెలిపారు.

ఇంకా ఎంగిలి కూటికి ఆశపడుతున్నారు.. ఇంత వయసు వచ్చింది మీరంతా కమిటీ సభ్యులా అంటూ కూడా తిట్టిపోశానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. అయితే ప్రతిసారి అవార్డులు పుష్కరాలు వస్తున్న సమయంలోనే ఈ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి మోహన్ బాబు.. చిరంజీవి లాంటి వ్యక్తులను ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తున్నారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు