Meera Chopra: పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉంది- మీరా చోప్రా

Meera Chopra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది . ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ సంధ్య అనే అమ్మాయి ప్రేమించిన వాడితో పెళ్లి చేయడానికి పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం అంత ఇంత కాదు. తన లైఫ్ నే రిస్క్ చేసి మరీ వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. అయితే ఇప్పుడు బంగారం సినిమా కథ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ సినిమాలో సంధ్య క్యారెక్టర్ లో నటించిన మీరా చోప్రా ను గుర్తు చేయడానికే.. ఆ సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది.

తెలుగులో మీరా చోప్రా బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడు సినిమాలలో నటించింది. అయితే ఎన్ని సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాకా తెలుగులో హీరోయిన్ గా రాణించలేకపోయింది. దాంతో ప్రస్తుతం అడపాదడపా తమిళ్ మరియు హిందీ సినిమాలు చేస్తు కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే ఈ భామ సినిమాల పరంగా ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇక లేటెస్ట్ గా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఈ అమ్మడు సోషల్ మీడియాలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది.

ఇటీవలనే భారత పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు పై చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో హీరోయిన్ మీరా చోప్రా వరకు చేరింది. దాంతో ఆమె ఆ వీడియో కింద “పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి.. ఆయన ఆంధ్ర ప్రదేశ్ కు సీఎం అయితే చూడాలని ఉంది ” అని కామెంట్ చేసింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు