Pawan kalyan : సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా పై ఫ్యాన్స్ కు టెన్షన్

Pawan kalyan

సురేందర్ రెడ్డి , అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ తరువాత సురేందర్ రెడ్డి ఏ హీరోతో కలిసి సినిమా చేస్తాడనేది అందరిలో ఉత్కంఠతను కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఏజెంట్ అంచనాలను మించి భారీ ఫ్లాప్ ఎదుర్కోవడంతో సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి ఏ హీరో ఆసక్తి చూపించట్లేదని వార్తలు వచ్చాయి. ఆ తరువాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా కొన్ని పుకార్లు ట్రెండ్ అయ్యాయి.

అయితే అనూహ్యంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సురేందర్ రెడ్డి త్వరలోనే పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తోన్నాయి. ఇక ఈ
సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా రోజుకొకరకంగా వార్తలు వస్తుండటం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ ను రేపుతోంది అని చెప్పవచ్చు,

ఇన్సైడ్ సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని టాక్. అయితే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలాగే కేవలం 20 నుంచి 30 రోజుల కాల్ షీట్ తో కంప్లిట్ చేసి, ఎలెక్షన్స్ ముందు రిలీజ్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారట. అయితే కొన్ని నెలల క్రితమే ఇదే ధోరణిలో హడావిడిగా షూటింగ్ చేసి రిలీజ్ చేరిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మళ్ళీ సురేందర్ రెడ్డి సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అదే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడటం తప్పదు. పైగా ఆ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అని టాక్ వస్తుండగా ఒక వేళా సినిమా ఫ్లాప్ అయితే గనక పవన్ రాజకీయ పరంగా కూడా ఇబ్బదులు ఎదుర్కోవలసి వస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు