AA To Atlee: ఫోన్ లో చెప్పడానికి ఆర్ధిక స్థోమత సరిపోదని

AA To Atlee

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జ‌వాన్‌`. రిలీజైన రోజు నుంచే అత్యధికంగా వసూళ్లు రాబట్టి ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. అట్లీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాను “రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్” స‌మ‌ర్ప‌ణ‌లో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న భారీ ఎత్తున రిలీజ్ అయింది.

ఈ సినిమాకి రిలీజైనప్పటి నుండి కేవలం ఆడియన్స్ నుండి మాత్రమే కాకుండా, పలువురు సెలబ్రిటీస్ నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఇదివరకే ట్విట్టర్ వేదికగా “జవాన్” సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక తాజాగా పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

మొదటగా చిత్ర యూనిట్ అందరికీ జవాన్ సినిమా పెద్ద హిట్ అయ్యినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. షారుఖ్ గారు తన బెస్ట్ ఎవర్ మాసీయెస్ట్ అవతార్ అండ్ స్వాగ్ తో ఇండియాని ఊపేసారు. షారుక్ ను అలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని అలానే చూడాలి అనుకున్నామని బన్నీ తెలిపాడు. అలాగే విజయ్ సేతుపతి ఎప్పటిలానే టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు అలాగే నయనతార, దీపికా పదుకోన్ లు తమ ప్రెజెన్స్ తో మెరిశారు అని ఇక అనిరుద్ తన మ్యూజిక్ తో ఇండియా ఆడియెన్స్ ని ఒక లూప్ పెట్టేసాడు. అంటూ దర్శకుడు అట్లీ తో పాటు టీం అందరికి అభినందనలు తెలియజేసాడు బన్నీ.

- Advertisement -

బన్నీ పోస్ట్ చూసాక “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో చంద్రమోహన్ వెంకటేష్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ కి రాసిన ఉత్తరం గుర్తొస్తుంది.
వెంకటేష్ దానిని పుస్తకం అనుకోవడం, కాదు ఉత్తరం అని ప్రకాష్ రాజ్ చెప్పడం, ఫోన్ లో చెప్పడానికి ఆర్ధిక స్థోమత సరిపోక రాసి పంపించాడు అన్నట్లు , అంత పెద్ద పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు