Priyanka Jawalkar: ఆ హీరోతో షూటింగ్ లో ఫ్లర్ట్ చేసాను- ప్రియాంక జవాల్కర్

Priyanka Jawalkar

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. అయితే ఈ హీరోయిన్ షూటింగ్ సమయంలో ఒక హీరో విపరీతంగా ఫ్లర్ట్ ( ఇష్టంగా మాట్లాడటం ) చేసిందట, ఆమె ఈ విధంగా ఫ్లర్ట్ చేసిన విషయాన్నీఒక షో లో తానే స్వయంగా బయట పెట్టింది.

ఇటీవలనే తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి ఒక షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ధమాకా పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ షో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ షో కు ఇటీవలనే గెస్ట్ గా వెళ్ళింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఇక హీరో కం యాంకర్ విశ్వక్ సేన్ ప్రియాంక జవాల్కర్ తో మీరెప్పుడైన షూటింగ్ సెట్ హీరో లేక మీ కో ఆర్టిస్ట్ లతో ఫ్లర్ట్ చేసారా అని అడిగారు. దాంతో వెంటనే ప్రియాంక జవాల్కర్ అవును చేశాను అని సమాధానం ఇచ్చింది.

అయితే ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలలో మాత్రమే నటించింది. మొదటి సినిమా విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా, సత్య దేవ్ తో తిమ్మరుసు అలాగే కిరణ్ అబ్బవరం తో యస్ ఆర్ కల్యాణ మండపం అయితే ఈ ముగ్గురు హీరోలతో పని చేసిన ప్రియాంక జవాల్కర్ ఏ హీరోతో ఫ్లర్ట్ చేసిందననేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఎక్కువ మంది విజయ్ దేవరకొండ తోనే ఆమె ఫ్లర్ట్చేసుండొచ్చు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు