RaviTeja: మాస్ మహారాజ మ్యాసివ్ అప్డేట్ – టైటిల్ అదేనా..?

ఈ సంవత్సరం బిగినింగ్ లో చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ తర్వాత వచ్చిన రావణాసుర సినిమాతో డిజాస్టర్ చవిచూశాడు. తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభించిన రవితేజ తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో తన 73వ సినిమా అనౌన్స్ చేసాడు రవితేజ. ఈ సినిమా టైటిల్ జూన్ 12న రివీల్ చేయనుండగా ఇవాళ వచ్చిన అనౌన్సమెంట్ పోస్టర్ టైటిల్ పై ఆసక్తి పెంచుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా విషయంలో ‘ఈగల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

‘ఆ లావాకి ఓ పేరుంది, ఆ పేరుకి ప్రతిధ్వని ఉంది, ఆ ప్రతిధ్వని ప్రకంపనం పుట్టిస్తుంది’ అన్న లైన్స్ తో ఉన్న పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమా రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అనిపిస్తుంది. ఆ పోస్టర్ కి ఉరుములు మెరుపుల బీజీఎమ్ తో పాటు ఈగల్ సౌండ్ కూడా ఉండటంతో సినిమా టైటిల్ కూడా ఈగల్ అన్నది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని సంకేతాలు వస్తున్నాయి.

రావణాసుర సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ ఆ సినిమా మిస్ ఫైర్ అవ్వటంతో నెక్స్ట్ మూవీస్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మరి, ముందు నుండి ప్రచారంలో ఉన్నట్లు ఈగల్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు